Monday, July 28, 2025

యాదగిరిగుట్ట ఆలయంలో కమిటీల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వివిధ విభాగాలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఆలయ ఇఒ వెంకట్రావు ఆదేశాలతో వివిధ విభాగాలలో పారదర్శకత పాటించేందుకు, నిర్వహణ లోపాలను నివారించేందుకు, అంతర్గతంగా ఆడిట్ నిర్వహించేందుకు, భక్తులు, స్థానికుల నుండి వచ్చే ఫిర్యాదులు పరిశీలించి, తగు సూచనలు, లోపాలను ఈవో దృష్టికి తీసుకొచ్చే విధంగా కమిటీలను ఏర్పాటు చేశారు.

ఆలయం, ప్రసాదం, అన్నదానం మానిటరింగ్ కమిటీ, భక్తుల రద్దీ మేనేజ్‌మెంట్ కమిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కమిటీ, శానిటేషన్, క్లీనింగ్ మానిటరింగ్ కమిటీ, పవర్, సీసీ కెమెరాలు, వైర్‌లెస్ సిస్టమ్, బ్యాటర్ వెహికల్స్, ఏసీలు, లైట్స్ మానిటరింగ్ కమిటీ, గదుల వసతి మానిటరింగ్ కమిటీ, ఎడ్యూకేషన్ ఇన్స్‌స్టిట్యూట్ మానిటరింగ్ కమిటీ, రెవెన్యూ మేనేజ్‌మెంట్ కమిటీ, లీజు, రెంటు మేనేజ్‌మెంట్ కమిటీ, అకౌంట్స్ మేనేజ్‌మెంట్ కమిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈవో అధ్యక్షతన దేవస్థానం అధికారులు, సిబ్బందిని పలు విభాగాలుగా చేసి కమిటీలను నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీలు వారికి కేటాయించిన విభాగాలను పరిశీలించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News