Monday, July 28, 2025

మేడ్చల్ మల్కాజిగిరి బిసి సంఘం అధ్యక్షులుగా వేముల కేశవనాదం గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోడుప్పల్ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా వేముల కేశవనాదం గౌడ్ నియమితులయ్యారు.ఈ మేరకు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులుగా నియమక పత్రం అందుకున్నారు.ఈ మేరకు పలువురు రాష్ట్ర, జిల్లా బీసీ సంఘం నాయకులు, సోదర సోదరీమణులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, తెలంగాణ రాష్ట్ర బిసి మహిళా అధ్యక్షురాలు మని మంజరి,బైరి రవికృష్ణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు,కుల్కచర్ల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు, కనకాల శ్యామ్ జాతీయ బిసి యువజన సంఘం అధ్యక్షులు, గూడూరు భాస్కర్ తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ బిసి అధ్యక్షురాలు సిద్ధాంతం శ్యామల, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకురాలు ఎరుకల శారద గౌడ్, మనిచర్ల లావణ్య జిల్లా, మండల బీసీ సంఘం నాయకులు తదితరులు హాజరయ్యారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News