ముంబై నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానం (Indigo Flight) అది. ప్రయాణికులు అంతా విమానం ఎక్కి తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. అయితే అప్పుడే అసలు సమస్య మొదలైంది. సరిగ్గా టేకాఫ్‌కి ముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ మధ్యలో ప్రయాణికులు చేసిన రభస అంతా ఇంతా కాదు. విమాన సిబ్బందిని ఒక్కొక్కరుగా మాటలతో దాడి చేశారు.
ఈ ఘటన శనివారం రాత్రి ముంబైలో చోటు చేసుకుంది. విమానంలో (Indigo Flight) ప్రయాణించేందుకు అంతా రెడీ అనుకున్న వేళ విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని పిలువు వచ్చింది. అయితే ప్రయాణికులు తొలుత మామూలుగానే ఉన్నారు. కానీ, క్రమంగా సహనం కోల్పోయారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో చెప్పాలని సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సిబ్బంది సమాధానం సమాధానం చెప్పలేకపోయారు.
ఒక ఎయిర్ హోస్టెస్ అయితే ‘‘మీకు దండం పెడతా.. దయచేసి కూర్చొండి’’ అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది. ఇదంతా ఓ ప్రయాణికుడు రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి 9.45 గంటలకు బయలుదేరాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యంగా అంటే.. రాత్రి 11.40 గంటలకు బయలుదేరింది.