Monday, July 28, 2025

కొండాపూర్‌లో రేవ్‌పార్టీ

- Advertisement -
- Advertisement -

సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్‌పార్టీని ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారు. ఎపికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.080కిలోల గంజాయి, 50 ఓజీ కుష్,11.57 గ్రాముల మ్యాజిక్ మష్రుమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్, నాలుగు కార్లు, 11మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ఎపిలోని విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు కలిసి కొండపూర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఎపికి చెందిన వారి వద్ద డబ్బులు తీసుకుని వీకెండ్‌లో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్లకు తీసుకుని వస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో డిజేలు, మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎపికి చెందిన రాహుల్, ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్,

తోట కుమారస్వామి, అడపా యశ్వంత్, శ్రీ దత్, నంద సమతా తేజ రేవ్ పార్టీ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. అందరూ కలిసి కొండాపూర్‌లోని ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. నిర్వాహకులు యువతులను తీసుకువచ్చి రేవ్ పార్టీలో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తూ మందు, డ్రగ్స్ లో మునిగిపోయారు. ఈ విషయం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ సిబ్బందికి తెలియడంతో ఎస్సైలు సంధ్య, బాలరాజు, సిబ్బంది కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. పార్టీ చేసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని, డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు కోసం నిందితులును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News