పాకిస్థాన్‌లో మరో మూడు పోలియో వైరస్ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 17కి పెరిగిందని అధికారులు ఆదివారం తెలిపారు. తాజా కేసుల్లో కైబర్ ఫఖ్తుంఖ్వా(కెపి)లోని లక్కీ మార్వాట్, ఉత్తర వజీరిస్థాన్ జిల్లా నుండి రెండు, సింధ్‌లోని ఉమెక్తెద్క్రోట్ జిల్లా నుండి ఒకటి ఉన్నాయని పాకిస్థాన్ పోలియో నిర్మూలన కార్యక్రమం(పిపిఇపి) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తాజా గుర్తింపులతో 2025లో పాకిస్థాన్‌లో మొత్తం పోలియో కేసుల సంఖ్య 17కు పెరిగింది. వాటిలో పది కైబర్ ఫఖ్తుంఖ్వాలోనే నమోదయ్యాయి. పోలియో ఇప్పటికీ వ్యాప్తి చెందుతున్న ఆప్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ప్రపంచంలోని చివరి రెండు దేశాలలో ఒకటిగా ఉంది. పోలియో వైరస్‌ను నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, భద్రతా సమస్యలు, టీకా మీద సందేహం, తప్పుడు సమాచారం వంటివి అక్కడ పురోగతిని అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది.
పాక్ లో మరో మూడు పోలియో వైరస్ కేసులు నమోదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -