- Advertisement -
గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి అమ్మ పరవల్లు గలగల పారుతున్నది. ఈ వర్షాకాలం తొలిసారిగా గోదావరిలో నిండుగా నీరు ప్రవహిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం వాగుల్లోని వంకలో నీరు మొత్తము మంజీరా, హరిద్ర, గోదావరిలో నీరు చేరి నిండుగా ప్రవహిస్తున్నది. గోదావరిలో ఉన్నటువంటి పాత శివాలయం చుట్టూ నీరు ప్రవహిస్తూ గంట గంటకు పెరగడంతో ఉదయం నుండి గోదావరిలో నీటి ప్రవాహంలో పాత శివాలయము మునిగింది. గోదావరి చుట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది కావున గోదావరి తీర ప్రాంతానికి వ్యవసాయం కోసం కానీ పశువుల మేత కోసం కానీ వెళ్ళకూడదని తాసిల్దార్ హెచ్చరించారు.
- Advertisement -