మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే రాష్ట్రంలో ఎరువుల కొర త సృష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామంచంద్రరావు ఆరోపించారు. జోగులాంబ గద్వాల పట్టణంలోని ఎస్‌వి ఈవెంట్ మాల్‌లో మ హబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణతో కలిసి ఆదివా రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు మోపుతోందని మండిపడ్డారు. యుపిఎ పాలనలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని, అప్పట్లో యూరి యా కొరతతో రైతు లు ఎన్నో ఇబ్బందు లు ఎదుర్కొన్నారన్నా రు. క్యూలైన్లలో పోలీసులు లాఠీచార్జీలు చేసేవారని, కానీ మోడీ ప్రభు త్వం వచ్చాక, ఇంపోర్టెడ్ యూరియాను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.
తెలంగాణకు అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ గా 12.02 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియాను కేం ద్రం సరఫరా చేసిందని అన్నారు. ఇది అవసరానికి మించి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సరఫరా చేశారన్నారు. అయినప్పటికీ రాష్ట్రం లో యూరియా కొరత ఉందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి జెపి నడ్డాను కలిసినప్పుడు తెలంగాణకు అవసరమైన యూరియాను కేంద్రం పూర్తిగా పంపిణీ చేస్తుందని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్రం తెలంగాణకు అవసరమైన మేరకు యూరియా పంపుతున్నప్పటికీ మార్కెట్‌లో యూరియా కొరత ఎందుకు ఏర్పడిందని, దీనిపై దర్యాప్తు చేయాలని కూడా రేవంత్ రెడ్డిని కోరామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎరువుల కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తోందనే అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎరువుల విషయంలో తీవ్ర నిర్లక్షం చేసిందని, రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలని, ఎరువులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలని అన్నారు. గద్వాల కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోంది కానీ ఇక్కడ రైతులకు సాగునీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి స్నిగ్ధా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాగర్‌కర్నూల్ ఎంపిగా పోటీ చేసిన పార్టీ అభ్యర్థ్ధి భరత్ ప్రసాద్, బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్ పాషా, పార్టీ మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, జయలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎష్ రెడ్డి, గత అసెంబ్లీలో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు బలిగేరా శివారెడ్డి, రాజగోపాల్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.