మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వ రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్ఐపి)పై విచారణ చేపట్టిన జస్టిస్ పినా కి చంద్ర ఘోష్ కమిషన్ సోమవా రం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. అదేరో జు సాయంత్రం రాష్ట్ర మం త్రివర్గ సమావేశం జరుగనున్న నేపధ్యంలో ఉదయమే జస్టిస్ ఘోష్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని ఈ వర్గాల సమాచారం. మంత్రివర్గం సమావేశంలో కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నివేదిక ప్రభుత్వానికి మంత్రివర్గ సమావేశానికి ముందే అందజేయడం కోసమే జస్టిస్ ఘోష్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకోవడానికి కారణంగా పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లా క్లోని పిల్లర్లు కుంగిన ఘటనతో పాటు అన్నా రం, సుందిల్ల బ్యారేజీలకు జరిగిన ఇతర నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం 2014 మార్చి 14న జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన కాళేశ్వరం ప్రాజెక్టుపై వి చారణ కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా మాజీ ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రా వు, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావులతో పాటు నీటి పారుదల శాఖలో పనిచేసిన ముఖ్యకార్యదర్శులు ఎస్.కె.జోషి, వికాస్ రాజ్, సోమేష్ కుమార్ రజత్ కుమార్లతో పాటు ఆనాడు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన కె.రామకృష్ణారావులను జస్టిస్ పి.సి.ఘోష్ విచారించారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో పాటు మొత్తం 115 మందిని కమిషన్ విచారణకు పిలిచి వారి నుంచి అఫిడవిట్లను స్వీకరించి వాటి ఆధారంగా విచారించింది. అంతే కాకుండా కమిషన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డిఎస్ఎ) నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఇలా ఉండగా, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తమకు కాళేశ్వరం కమిషన్ నివేదిక అందబోతుందని, దానిపై మంత్రి వర్గంలో చర్చించాక ఏ విధంగా ముందుకు వెళ్లాల్లో నిర్ణయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.