కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్?
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తేలిపోతోంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 2-1తో వెనుకంజలో నిలిచిన భారత్ నాలుగో టెస్టులోనూ డ్రా ముగించింది. అయితే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీపై ఇంటిబయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నుంచి టీమిండియా టెస్టులో రాణించలేకపోతోంది. వరుస ఓటములతో సతమతమవుతోంది. గంభీర్ కోచ్‌గా భారత్ ఇప్పటి వరకు 14 టెస్టులో ఆడింది. వాటిలో నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. కోచ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలిచింది.
ఆ తర్వాత ఒక్క సిరీస్ గెలవలేదు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో అనూహ్యంగా 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ అవ్వడం అదే తొలిసారి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో టీమిండియా చేజార్చుకుంది. ఈ సిరీసఖలో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా వరుసగా మూడు టెస్టుల్లో ఓటమిపాలైంది. చివరి టెస్టును డ్రాగా ముగించి పరువు నిలబెట్టుకుంది. ఈ పరాజయాలతో డబ్ల్యూటిసి 2025 ఫైనల్ చేరుకోవాల్సిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక తాజా జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్‌పై తొలి మూడు టెస్టుల్లో విజయం కోసం ఆఖరివరకు పోరాడిన గిల్‌సేన ఒక టెస్టులో మాత్రమే విజయం సాధించింది. రెండీంటిలో ఇంగ్లండ్ గెలుపొందగా..
ఒక మ్యాచ్‌లోనే భారత్ గెలుపొందింది. అనంతరం జరిగిన నాలుగో టెస్టునూ డ్రా ముగించింది. దీంతో టెస్ట్ ఫార్మాట్ టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యూహాలు రచించడంలో గంభీర్ తీవ్రంగా విఫలమయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని కోచ్‌గా తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. బిసిసిఐ సయితం అందుకు పావలు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గంభీర్ స్థాన్ మాజీ దిగ్గజం ఎన్‌సిఎ ఛీప్ వివిఎస్ లక్షణ్‌ను కోచ్‌గా నియమించాలనే బిసిసిఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బిసిసిఐ ఎటువంటి అధికారికంగా తెలుపకపోయినా ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన అనంతరం చర్యలు ఉండవచ్చనే వార్తలు నెట్టింట్లో ప్రచారమవుతున్నాయి.