నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న ‘మైసా’ (Maisa) అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకుంది. సాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మైసా ఆదివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. దీనికి కోర్ టీం హాజరయ్యారు. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూల్‌లో రష్మిక టీంలో చేరనుంది. మైసా గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా (emotional action thriller) ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని అవాతర్‌లో కనిపిస్తుంది.
‘మైసా’ ఆరంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -