- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబంకీలో అవశనేశ్వర్ మహదేవ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. విద్యుత్ తీగ తెగిపడడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది ఇద్దరు మృతి చెందారు. 29 మంది భక్తులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో జలాభిషేకం ఉత్సవం జరుగుతుండగా కోతులు కరెంట్ తీగను కదిలించాయి. కరెంట్ తీగ భక్తుల మీద పడడంతో పరుగులు తీశారు. తొక్కిసలాట జరగడంతో ఇద్దరు మృతి చెందగా 29 మంది గాయపడ్డారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సిబ్బంది కరెంట్ తీగను సరి చేశారు.
- Advertisement -