యంగ్ బ్యూటీ శ్రీలీల (Young beauty Sreeleela) ప్రస్తుతం వరుస సినిమాలో టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారింది. హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా.. పెద్ద-చిన్న హీరోలతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ చిన్నది. అయితే, ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ పెద్ద ప్రాజెక్ట్ (big project Bollywood) పట్టేసిందట. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించబోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో నటుడు బాబీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్‌గా మారేందుకు శ్రీలీల గట్టి ప్లాన్ చేస్తున్నట్లు బి-టౌన్ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ బిగ్ మూవీలో..
- Advertisement -
- Advertisement -
- Advertisement -