Monday, July 28, 2025

హోంగార్డు రిక్రూట్‌మెంట్‌.. కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

పాట్నా: హోంగార్డు రిక్రూట్‌మెంట్‌లో భాగంగా స్పృహతప్పిపడిపోయిన యువతిని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం గయాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఓ యువతి ఫిజికల్ టెస్టుకు హాజరైంది. రన్నింగ్ చేస్తున్నప్పుడు యువతి స్పృహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కదులుతున్న అంబులెన్స్‌లో ఆమెపై ఇద్దరు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తాను స్పృహలేనప్పుడు తనపై అత్యాచారం జరిగిందని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సదరు యువతికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News