Monday, July 28, 2025

ఆ ఇద్దరి విషయంలో అలా చేయలేం కదా?: గిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు రవీంద్రజడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన పోరాట పటిమతో బ్యాటింగ్ చేయడంతో టెస్టు డ్రాగా ముగిసింది. జడేజా, సుందర్ సెంచరీలతో కదంతొక్కారు. ఈ సందర్భంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు సెంచరీకి చెరువలో ఉన్నప్పుడు డ్రా కోసం బెన్ స్టోక్స్ ప్రతిపాదనను తాము తిరస్కరించామన్నారు. ఇద్దరు ఆల్ రౌండర్లు సెంచరీలు చేసి డ్రాతో ముగించడం గొప్ప విషయమన్నారు. ఐదో రోజు ఒక్కో బంతిని ఆడుతూ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అందుకు తగినట్టుగానే భాగస్వామ్యాలు నిర్మించామని తెలియజేశారు.

సుందర్, జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడారు. ఇద్దరు 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆట ఆపడం సమంజసం కాదు అని, సెంచరీలకు వాళ్లు పూర్తి అర్హులని పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఐదు రోజులకు వెళ్లిందని, టెస్టు క్రికెట్ మజాను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేశారన్నారు. గత కొన్ని రోజుల నుంచి తాము ఒత్తిడిలో ఉన్నామని, ఇప్పుడు వచ్చిన ఫలితంతో ఊరటగా అనిపించిందన్నారు. ఐదు టెస్టులో విజయం సాధించి ఈ సిరీస్‌ను డ్రాగా ముగుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఓటమి నుంచి చాలా నేర్చుకుంటున్నామని, దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు చేయాలనే లక్ష్యంతో తోనే బరిలోకి దిగుతామని గిల్ చెప్పారు. ఇప్పటికే ఈ  సిరీస్ ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News