Tuesday, July 29, 2025

బాలాపూర్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News