Tuesday, July 29, 2025

చర్లలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం…

- Advertisement -
- Advertisement -

చర్ల: కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. మావోయిస్టు అమరవీరుల సభలు జరపాలని బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. ఆర్‌.కొత్తగూడెం, దానవాయిపేటలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు అమరవీరుల స్తూపాలు నిర్మించాలని పిలుపునిచ్చాయి.

మరో వైపు భూపాలపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ముకునూరు, నీలంపల్లి, బూరుగూడెంతో పాటు సర్వాయిపేట గ్రామాల్లో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు అగ్రనేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి జన జీవన విధానంలో కలవాలంటూ పోస్టర్లు కనిపించాయి. మావోల మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని పోస్టర్లలో ఉన్నాయి. మావోయిస్టు ఆత్మపరిరక్షణ-ప్రజాఫ్రంట్‌ పేరిట పోస్టర్లు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News