- Advertisement -
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయానికి ఇన్ ఫ్లో1,00,257 వేల క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 92,556 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.816 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 317.170 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 7.795 టిఎంసిలుండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టిఎంసిలుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ఐదు కేంద్రాలలో కొనసాగుతోంది.
- Advertisement -