- Advertisement -
హైదరాబాద్: నాగోల్ లో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాలో తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ (25) హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ నాగోల్ నివసిస్తున్నాడు. నాగోల్ లోని ఇండోర్ స్టేడియంలో రాకేష్ షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాకేష్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వెల్లడించారు. గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
- Advertisement -