Tuesday, July 29, 2025

దివ్య దేశ్‌ముఖ్‌ను అభినందించిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సిఎం రేవంత్ పోస్టు పెట్టారు. దివ్య దేశ్‌ముఖ్ తోటి భారతీయ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపితో తలపడి ప్రతిష్టాత్మక టైటిల్‌ను సాధించడం చాలా గొప్ప విషయమని, ఇద్దరూ కలిసి దేశం గర్వపడేలా చేశారని ఆయన కొనియాడారు. సెమీ-ఫైనల్స్‌లో ప్రపంచ స్థాయి ప్రత్యర్థులను ఓడించి, మన సత్తా ఏంటో చూపించారని ఆయన ప్రశంసించారు. సరైన అవకాశాలు లభించినప్పుడు మహిళలు ఎంత ఎత్తుకు ఎదగగలరో నిరూపించారని ఆయన తెలిపారు.

మీ ప్రయాణం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని, దివ్య దేశ్‌ముఖ్ , కోనేరు హంపిలు ఇద్దరూ రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కాగా, ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News