Tuesday, July 29, 2025

తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ హైకోర్టుకు మరో నలుగురు కొత్త జడ్జిలు రానున్నారు. దేశవ్యాప్తంగా పలు హైకోర్టులకు సోమవారం 19మంది జడ్జీలు, అదనపు జడ్జీలు నియమితులయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వీరి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీలను నియమించారు. గాడి ప్రవీణ్‌కుమార్‌, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్‌ మీరా మొహుద్దీన్‌ లు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు, నలుగురు అదనపు జడ్జీలు.. ఇక, అస్సాం హైకోర్టుకు నలుగురు జడ్జీలను నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News