Tuesday, July 29, 2025

‘కూలీ’ ట్రైలర్ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న కూలీలో కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ అందరూ పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించిన ట్రైలర్ ప్రకటన పోస్టర్ అదిరిపోయింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News