- Advertisement -
మన తెలంగాణ/సారంగాపూర్: గత పది సంవత్సరాల తరువాత రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరయ్యాయని దీంతో ప్రతీ లబ్దిదారునికి సంక్షేమ పథకాలు అందాలని బిజెఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారులను ఉద్దేశించి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నూతన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రతీ ఒకరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా, నిరుపేదలుగా ఈ రేషన్‌కార్డుతో గుర్తించవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో రేషన్ కార్డులను అత్యధికంగా మంజూరు చేయించడం జరిగిందన్నారు.
- Advertisement -