ఎముకలకు సంబంధించి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఇండోర్ కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రస్తుతం వీల్ ఛైర్ కే పరిమితమైంది. ఆమె తనకు అనాయాస మరణం పొందేలా అనుమతించాలని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జబ్రాన్ కాలనీ కమ్యునిటీ భవనంలో ప్రభుత్వ ప్రాథణిక పాఠశాలలో చంద్రకాంత జెత్వానీ
పని చేస్తున్నారు. ఆమె అస్థియోజెనిసిస్ ఇంపెర్పెక్టాతో బాధపడుతున్నారు., ఇది ఎముకల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అరుదైన వ్యాధి.ఎముకలను బలహీన పరచే అరుదైన జన్యు రుగ్మత అని ఆమె చెప్పారు.తనకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని తాను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు చంద్రకాంత జెత్వానీ తెలిపారు.తాను ఇప్పటికే తన కళ్లు, శరీరాన్ని మరణానంతరం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. వైద్య విద్యార్థులు తన వ్యాధి గురించి అధ్యయనం చేయాలని తాను కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కారుణ్య మరణానికి రాష్ట్రపతి అనుమతి కోరిన ఉపాధ్యాయురాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -