మన తెలంగాణ/చర్ల: నక్సల్బరీ బాటే దేశ విముక్తి మార్గమని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ బీకే,ఏఎస్‌ఆర్ కమిటీ పేరిట సోమవారం మండల పరిధిలోని ఆర్ కొత్తగూడెం కేంద్రంగా కరపత్రాలు, బ్యానర్లు వెళిశాయి. జూలై 28 నుండి ఆగస్టు 3వరకు జరిగే అమరవీరుల వారోత్సవాలు గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని లేఖలో పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం 50ఏళ్లుగా ప్రజా యుద్దం కోనసాగుతోందని అన్నారు. ఈ పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయరని లేఖలో పేర్కొన్నారు.
మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ 2047వరకు బ్రాహ్మణీయ హిందు రాజ్య నిర్మించే లక్షంతో సామ్రాజ్యవాదుల మరియు కార్పొరేట్ల ప్రయోజనాలను ప్రొత్సహిస్తోందని అందులో భాగంగానే మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా ప్రచారాలతో విదేశి పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సరళతరం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు, ప్రజాస్వామ్యం అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరునెలలు కూడా గడవక ముందే బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ కగార్ పేరిట సభలు సమావేశాలు నిషేదించి అనేక ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి అనేక పథకాలు రూపొందించిదని నరేంద్రమోడీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ప్రమాదకరంగా భావించి రకరకాల వ్యూహాత్మక దాడులు చేస్తోందన్నారు.2017లో సమాధన్, 2022లో సూరజ్ కుండ్ వూహాలు విఫలమయ్యాయి. 2024 జనవరి, 2025మే నుండి కగార్ ఆపరేషన్ పేరుతో కృరమైన దాడులు ప్రారంభించారని లోఖలో పేర్కొన్నారు.
హిందుత్వ ఫాసిజం రెచ్చిపోయి దళితులు, ఆదివాసీలు, ముస్లీంలు, క్రిస్టియన్లపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ ఏడాది నరేంద్ర మోడీ 3.o ప్రభుత్వం మరింత దోపిడి అణచివేతలను పెంచిందని అమయాకులైన వారిపై డ్రోన్ దాడులు చేసిందన్నారు.ఈ దాడుల్లో అనేక మంది వీరపుత్రికలు, వీర పుత్రులు అమరవీరులైయ్యారని వారిని స్మరించుకుందమన్నారు.ఈ సంవత్సర కాలంలో 194 మందికి పైగా కామ్రేడ్స్ ప్రాణాలు అర్పించారని వారి త్యాగాలను ఎత్తిపడుతూ గ్రామాల్లో, బస్తీల్లో అమరవీరుల స్థూపాలు నిర్మించి నివాళ్లు అర్పించాలని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి అని లేఖలో పేర్కొన్నారు. అయితే మావోయిస్టుల పేరిట వెలసిన కరపత్రాలు, బ్యానర్లు మండలంలో కలకలం రేపాయి. వారోత్సవాల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో నంటు సరిహద్దు గ్రామాల ప్రజలు వనికిపోతున్నారు.మరోవైపు వారోత్సవాల నేపథ్యంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతూ అనుమనీతులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేస్తున్నారు.