Tuesday, July 29, 2025

నెమ్మదిగా వెళ్లమని చెప్పినందుకు వ్యక్తిపై దాడి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కాసిపేటః వేగంగా వాహానం నడుపుతున్న వారిని నెమ్మదిగా వెళ్లమని కోరినందుకు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచిన సంఘటన కాసిపేట పోలీస్ స్టేషన్ పరిదిలోని ముత్యంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ముత్యంపల్లి గ్రామానికి చెందిన గిన్నె సతీష్ తన ఇంటికి నడుచుకుంటు వెళ్తుండగా ద్విచక్రం వాహనంపై వెళ్తున్న ఆవుల రాజేందర్, ముద్రకోలు రాజు వాహానం వేగంగా సతీష్ వైపు తీసుకొని వెళ్లడంతో సతీష్ నెమ్మదిగా వెళ్లాలని సూచించడంతో ఆవుల రాజేందర్, ముంద్రకోలు రాజులు సతీష్ పై దాడి చేసి కొట్టడం జరిగిందని కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. దాడిలో సతీష్ ముఖ భాగం, మెడ భాగంలో గాయాలు అయ్యాయని గాయపడిన సతీష్ ను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి మంచిర్యాల ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం సతీష్ ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా ఆయన ప్రస్తుతం చికిత్స పొందుచున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సతీష్ సోదరి ముత్యాల లత ఫిర్యాదు మేరకు ఆవుల రాజేందర్, ముద్రకోలు రాజులపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News