Wednesday, July 30, 2025

హస్తినలోనే తేల్చుకుందాం

- Advertisement -
- Advertisement -

5న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలతో ఢిల్లీకి
సిఎం రేవంత్ మూడు రోజులు హస్తినలోనే
మకాం రాష్ట్రపతి, ప్రధాని మోడీను కలవనున్న
సిఎం బృందం ఎన్‌డిఎ కూటమి నేతలతోనూ
చర్చలు 7న 200ల మంది ప్రతినిధులతో
రాష్ట్రపతిని కలవనున్న సిఎం రాష్ట్రపతి వద్ద
పెండింగ్‌లో ఉన్న బిసి రిజర్వేషన్ల బిల్లును
ఆమోదించాలని కోరనున్న బృందం 5న
పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం అంతర్రాష్ట్ర
చెక్‌పోస్టుల రద్దు అన్ని మున్సిపాలిటీలలో
మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు కేబినెట్‌లో కీలక
నిర్ణయాలు వివరాలు వెల్లడించిన మంత్రులు
పొన్నం, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్
కుల సంఘాలు కదలిరావాలి: పొన్నం

మనతెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్‌ల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మంత్రివర్గ సమావేశం సుమారు 5 గంటల పాటు జరగ్గా ఈ భేటీలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 5వ తేదీన మంత్రులతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను సిఎం బృందం కలువనుంది. దీంతోపాటు బిసి రిజర్వేషన్‌ల విషయంలో ఇండియా కూటమి మద్ధతు కూడా ఈ బృందం కోరనుంది. బిసి రిజర్వేషన్‌లకు సంబంధించి బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడంతో దానిని త్వరితగతిన ఆమోదించాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చెక్ పోస్టులు సిబ్బంది కాకుండా ఇకపై వాహన్,

అడ్వాన్డ్ సిసి కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుంది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.బిసిలకు 42శాతం రిజర్వేషన్లపై కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బిసిల రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అందు కు సంబంధించిన కార్యాచరణను ప్రకటించాలని కేబినెట్‌లో భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆగష్టు 05వ తేదీన బిసిల రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు పార్లమెంట్‌లో పార్టీ ఎంపిల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని కేబినేట్ నిర్ణయించింది.

200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతితో భేటి
ఆగష్టు 06వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 07వ తేదీన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ఎంపిలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

గతంలో కెసిఆర్ చేసిన చట్టానికి
ప్రభుత్వం సవరణలు
గతంలో కెసిఆర్ తెచ్చిన చట్టంతో బిసిల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారడంతో రాష్ట్ర ప్రభు త్వం జూలై 10వ తేదీన జరిగిన కేబినేట్ మీటింగ్‌లో ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకుంది. చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకురావాలని ప్రభుత్వం తీర్మానించింది. చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్ ఫైల్‌ను జులై 14వ తేదీన ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. ఈ ఆర్డినెన్స్ ఫైలును కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించింది.
అందుకే బిసి రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్‌ను వెంటనే ఆమోదించాలని రాష్ట్ర కేబినేట్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయటంతో పాటు ఆగష్టు 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News