Tuesday, July 29, 2025

నాగారంలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కీసర ః నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి లక్ష్మీనగర్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న స్కూల్ భవన నిర్మాణంపై స్థానికులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. రాంపల్లి సర్వే నంబరు 381 నుంచి 385 లలో సెయింట్ ఆంథోని స్కూల్‌లో సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో అక్రమంగా జి+2 నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పండుతుందని అన్నారు. స్కూల్‌లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News