- Advertisement -
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలానికి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు గుంటి శేఖర్(45) విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ మాట్లాడుతూ మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.
- Advertisement -