Wednesday, July 30, 2025

మంచిరేవులలో చిరుత సంచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచిరేవుల, రాందేవ్‌గూడ ప్రాంతాలలో చిరుత సంచారిస్తోంది. మంచిరేవులోని ఏకో పార్కు, మిలిటరీ ఏరియాలోని టెక్‌పార్క్‌లో చిరుత ప్రవేశించినట్లు అటవీ అధికారులు తెలిపారు. 20 రోజులు గడుస్తున్నా చిరుత ఆచూకీ అంతు చిక్కడంలేదు. పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ,
నేక్నామ్‌పూర్‌, ఇబ్రహీంబాగ్‌ల గ్రామాల ప్రజలు చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాందోళనలో ఉన్నారు. త్వరలో చిరుతను పట్టుకుంటామని చిలుకూరు అటవీ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News