Thursday, July 31, 2025

మోగనున్న బాజ భజంత్రీలు.. ఎప్పటి వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయంటే..

- Advertisement -
- Advertisement -

శ్రావణమాసం షురూ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో పెళ్లి సందడి మొదలైంది. మూఢం, ఆషాడమాసం కారణంగా దాదాపు 48 రోజులుగా పెళ్లిళ్లు లేవు. దీంతో కళ్యాణ మండపాలు, వాటి మీద ఆధారపడిన అనేక మంది జీవితాలు వెలవెల పోయాయి. ఇక వస్త్ర దుకాణాలలోను, జువెలరీ షాప్‌లలోను పెద్దగా కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు శ్రావణమాసం షురూ కావడంతో తెలుగు రాష్ట్రాలలో సందడి మొదలైంది. ఈసారి ముహూర్తాలిలా పెళ్లిళ్లు, శుభకార్యాలలో ప్రజలు నిమగ్నం అయిపోయారు. షాపింగ్ కూడా కళకళలాడుతుంది ఈనెల 26వ తేదీ నుంచి వివాహాలకు మంచి ముహూర్తాలు ప్రారంభం కావడంతో అందరూ పెళ్లిళ్ల హడావిడిలో పడిపోయారు. ఇక ఈ సీజన్‌లో జులై 31, ఆగస్టు ఒకటి, మూడు, ఐదు తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చాలా బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.

నవంబర్ వరకు మంచి ముహూర్తాలు

ఇక సెప్టెంబర్ చివరి వారంలో కూడా శుభముహూర్తాలు ఉన్నాయని, అక్టోబర్ నెలలో మూడవ వారం మినహాయించి మిగిలిన అన్ని రోజులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. నవంబర్ నెలలో కూడా అనేక మంచి ముహూర్తాలు ఉన్నాయని ఇక పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారు తమ జాతకాలకు తగ్గట్టుగా ఉన్న ముహూర్తాలను చూసుకొని రెడీ అయిపోతున్నారు అని చెబుతున్నారు. ఈసారి మంచి ముహూర్తాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫంక్షన్ హాల్స్ ఇప్పటికే బిజీ అయిపోయాయి. ఇప్పటికే చాలామంది మంచి మంచి ముహూర్తాలు ఉన్న తేదీలలో ఫంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకున్నారు. ఇక కొందరు మంచి ముహూర్తాలు ఉన్న తేదీలలో తమకు అనుకూలమైన కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ దొరకకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ సీజన్ లో వీరందరికీ ఉపాధి ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే పెళ్లి చేయడానికి వచ్చే పురోహితుల దగ్గర నుండి, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, వంట మనుషులు, డెకరేషన్ చేసేవారు, టెంట్ హౌస్ సామాను ఇచ్చేవారు, ఫంక్షన్ హాల్స్ లో శానిటేషన్ చూసేవారు, ఆర్కెస్ట్రా కళాకారులు, సన్నాయి మేళం వారు, బ్యాండ్ వాళ్ళు ఇలా ఒకరేమిటి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇక ఈ సీజన్లో నవంబర్ వరకు పెళ్లిళ్లు ఉండడంతో వీరందరికీ ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు.

లక్షల సంఖ్యలో పెళ్ళిళ్లు…!
ఈసారి లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్లు ఒక అంచనా. ఇక పెళ్లిళ్ల సీజన్లో నగల దుకాణాలు, వస్త్ర వ్యాపారులు కూడా చాలా బిజీ అయిపో తారు. ఏది ఏమైనా శ్రావణమాస కల్యాణ వైభోగం ఎంతోమంది జీవితాలకు ఉపాధి నిస్తుందని, వెలుగులు నింపుతుందని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News