Sunday, September 14, 2025

గొప్ప మనసు చాటుకున్న రాహుల్ గాంధీ.. మహేష్ కుమార్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ఆపరేషన్ సిందూర్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పూంచ్ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ దత్తత తీసుకుని తన గొప్ప మనసును చాటుకున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ మేరకు మహేష్ కుమార్ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు చేస్తుండగా, తమ పార్టీ అగ్రనేత రాహులు మానవత్వాన్ని చాటుకున్నారని ఆయన తెలిపారు. రాహుల్ కెమెరాలు, టిఆర్‌పిని కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆ చిన్నారులు మేజర్లు అయ్యేంత వరకూ, డిగ్రీ వరకూ విద్యాభ్యాసం చేయించడానికి రాహుల్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. రాహుల్ గాంధీ ధైర్యంతో, కరుణతో, నిబద్ధతతో నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థ విఫలమైనప్పుడు ప్రేక్షకునిలా చూడకుండా కరుణతో ముందుకు వచ్చి అనాధలైన వారికి చేయూతనిచ్చారని మహేష్ కుమార్ గౌడ్ తన ట్వీట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News