Friday, August 1, 2025

నాగార్జున నన్ను 15 సార్లు కొట్టి… తరువాత ఏం చేశాడో తెలుసా?: ఇషా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 1998లో చంద్రలేఖ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణతో ఇషా కొప్పికర్ నటించారు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చెంపదెబ్బలు సన్నివేశాన్ని ఇషా కొప్పికర్ గుర్తు చేశారు. చంద్ర లేఖ సినిమా తనకు రెండో సినిమా, హీరో నాగార్జున తన చెంపపై గట్టిగా కొట్టే సన్నివేశం ఉందని, ఆయన తనపై నెమ్మదిగా కొట్టడంతో సన్నివేశం సరిగా రాలేదని, దీంతో మరోసారి గట్టిగా కొట్టమని నాగార్జున చెప్పానని వివరించారు.

నాగార్జున అలా తన చెంపపై 15 సార్లు కొట్టారని, అప్పటికే తన చెంప కందిపోవడంతో పాటు వాతలు కూడా పడ్డాయని పేర్కొన్నారు. నాగార్జున తన దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పారు, కానీ తానే వద్దని వారించానని గుర్తు చేస్తూ నవ్వుకున్నారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజమని ఇషా చెప్పుకొచ్చారు. 1997లో వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో తొలిసారిగా అతిథి పాత్రలో ఇషా నటించారు. నాగార్జునతో సినిమా చేసిన తరువాత హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషలలో ఆమె 50కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. పలు వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు. 2017లో నిఖిల్ హీరో తెరకెక్కిన కేశవ మూవీలో కూడా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News