Friday, August 1, 2025

‘కాంతార’ హీరో తెలుగు మూవీ.. దర్శకుడు ఎవరంటే..

- Advertisement -
- Advertisement -

‘కాంతార’ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రిషబ్‌ శెట్టి (Rishab Shetty). తానే నటించి, దర్శకత్వం వహించిన ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ‘కాంతార.. ఛాప్టర్-1’ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీంతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమాటో రిషబ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అయితే రిషబ్ మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ‘ప్రొడక్షన్ నెం.36’లో రిషబ్ హీరోగా నటిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రీలుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.

18వ శతాబ్ధంలో భారత్‌లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఓ తిరుగుబాటుదారుడి కథతో ఈ సినిమా రూపొందుతుంది. ప్రీలుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. (Rishab Shetty) ఇక ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలో కూడా ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తారు. అ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News