Friday, August 1, 2025

అభిషేక్ ది గ్రేట్.. ఆ ముగ్గురి తర్వాత మనోడే..

- Advertisement -
- Advertisement -

అభిషేక్ శర్మ (Abhishek Sharma).. క్రికెట్ ప్రియులకు ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. పంజాబ్‌కి చెందిన ఈ క్రికెటర్ టి-20 ఫార్మాట్‌లో చెలరేగిపోతాడు. ఆడిన మ్యాచులు తక్కువైనా.. ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా మరో ఘనతను సాధించాడు ఈ యువ క్రికెటర్. ఐసిసి ప్రకటించిన టి-20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 829 పాయింట్లతో నెం.1 టి-20 బ్యాటర్‌గా నిలిచాడు. ధీంతో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ తర్వాత నెం.1 ర్యాంకు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను (814 పాయింట్లు) అభిషేక్ వెనక్కినెట్టి నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు.

(Abhishek Sharma) ఇక మూడో స్థానంలోనూ భారత క్రికెటరే ఉండటం విశేషం. 804 పాయింట్లతో తిలక్ వర్మ నెం.3 ర్యాంకులో నిలిచాడు. ఇక భారత టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో ఆరో ర్యాంకులో ఉన్నాడు. మరో యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ 673 పాయింట్లతో రెండు స్థానాలకు పడిపోయి.. 11 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇక టి-20ల్లో అభిషేక్ టాప్ పొజిషన్‌లో ఉండగా.. అతని ఫ్రెండ్ శుభ్‌మాన్ గిల్ వన్డేల్లో నెం.1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. వీరిద్దరు టీం ఇండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ శిష్యులు కావడం విశేషం. ఇక వన్డేల్లో, టి-20ల్లో భారత్ జట్టు నెం.1 ర్యాంకులో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News