Friday, August 1, 2025

అదుపు తప్పి సింధు నదిలో పడిన బస్సు

- Advertisement -
- Advertisement -

జమ్ము కశ్మీర్ లోని గండేర్‌బల్ జిల్లాలో కుల్లాన్ వద్ద బుధవారం ఇండో టిబెటన్ బార్డర్ కు చెందిన బస్సు అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది. ఐటీబిపి కి చెందిన జవాన్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ఐటిబిపి అధికారులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు చెప్పారు. అయితే బస్సులో ఎందరు ఉన్నారో తెలియలేదు. గాయపడిన డ్రైవర్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News