భారతదేశం దేశానికి చెందిన ఇస్రో, అమెరికా కు చెందిన నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూమి పరీశీలన ఉపగ్రహాన్ని జిఎస్ ఎల్వీ రాకెట్ ద్వారా విజయవంతంగా ఖచ్చితమైన కక్షలో ప్రవేశపెట్టాయి. భారత అమెరికా అంతరిక్ష సహకారంలో ఇదో ముందడుగు. జియోసిక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోకు చెందిన జిఎస్‌ఎల్ వి ఎఫ్ -16 దాదాపు 19 నిముషాల ప్రయాణం, దాదాపు 745 కిలోమీటర్ల తర్వాత నిస్సార్- నాసా- ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ ( నిసార్) ఉపగ్రహాన్ని ఉద్దేశించిన సన్ సింక్రోనస్ సోలార్ ఆర్బిట్ (ఎస్‌ఎస్పిఓ)లోకి ప్రవేశపెట్టింది. జిఎస్ ఎల్ వి నిర్దేశిత కక్ష్యలోకి నిసార్ ను విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఇస్రో ప్రకటించింది. నిసార్ ఉపగ్రహం భూమిని స్కాన్ చేసి, 12 రోజుల వ్యవధిలో అన్ని వాతావరణ పరిస్థితులను, పగలు రాత్రీ డేటాను అందిస్తుంది. విసృ్తత శ్రేణి పరీక్షలను నిర్వహిస్తుంది.
భూమి, భూ వాతావరణం, పర్యావరణ వ్యవస్థలు, మంచు కరిగిపోవడానికి కారణాలు, సముద్ర ప్రాంతాలను అధ్యయనం చేయడం నిస్సార్ మిషన్ ప్రాథమిక లక్ష్యాలు. అమెరికా, భారతీయ సైన్స్ నిపుణులకు ఈ సమాచారం ఎంతగానో భవిష్యత్ పరిశోధనలకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. జిఎస్‌ఎల్ వి -ఎఫ్ -16 దాదాపు 2,383 కిలోల బరువుగల నాసా – ఇస్రో సింధటిక్ ఎవర్చర్ రాడార్(సిరార్) ఉపగ్రహాన్ని దాని ఉద్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా , ఖచ్చితంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. వారాయణన్ ప్రకటించారు. అన్నివాహన వ్యవస్థలు నిర్దేశించినట్లు గానే సాధారణంగా పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి డ్యూయల్ – బ్యండ్ రాడార్ ఉపగ్రహం నిస్సార్ ను మోసుకెళ్లే జిఎస్ ఎల్ వి-ఎఫ్ 16 రాకెట్ ను భారతదేశం విజయవంతంగా ప్రయోగించడం పట్ల కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఇది తుపానులు, వరదలు వంటి విపత్తుల కచ్చితమైన సమాచారం నిర్వహణలో గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు.