Friday, August 1, 2025

అట్టపెట్టెల్లో కోట్ల గుట్టలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్: ఎపిలిక్కర్ స్కామ్ కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ మండలం కాచారం గ్రామ శివారులోని సులోచన ఫామ్ హౌస్‌లో మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి దాచిన రూ.11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఎయిర్‌పోర్టులో పారిపోతుండగా దొరికాడని, అతను ఇచ్చిన సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడులు చేసి ఈ మొత్తం సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసులో ఎ1 రాజ్ కసిరెడ్డి, చాణక్యరెడ్డి ఆదేశాల మేర కు జూన్ 2024లో వినయ్ సహాయంతో వరుణ్ రూ.11 కోట్లు నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఇంకా ఎక్కడెక్కడ నగదు దా చారో, బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయా,

ఎక్కడైనా పెట్టుబడులు పెట్టా రా అనే కోణాల్లో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలతో అధికారులు తనిఖీలు చేసి నగదును గుర్తించారు. అటు ఎ1 కసిరెడ్డికి చెందిన రిసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన చాణక్యకు చెందిన  టీ గ్రిల్ రెస్టారెంట్‌ను కూడా అణువణువు పరిశీలించారు. నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే ఎవరెవరూ ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు? ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఎపి లిక్కర్ స్కామ్ కేసులో ఎ47 గా ఉన్న నెల్లూరుకు చెందిన ఆటో మొబైల్ ఇంజినీర్ షాజిల్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

గేటు వద్ద విద్యార్ధుల ఆందోళన :
అయితే సిట్ అధికారుల విచారణ అనంతరం సులోచన ఫామ్ హౌస్‌కి సూచిక బోర్డు పేరును తొలగించి పెయింట్ వేశారు. కళాశాల బోర్డును ధ్వంసం చేసి గేటు వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్ధులకు చదువు చెప్పాల్సిన యాజమాన్యం ఫామ్‌హౌస్‌లో డబ్బులు దాచడం ఏంటని ప్రశ్నించారు. చదువు చెప్పాల్సిన అధ్యాపకులు ఇలాంటి పనులు చేసి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

ఇది కట్టుకథే : రాజ్ కసిరెడ్డి
దర్యాప్తును పక్కదోవ పట్టిస్తూ తనకు బెయిల్ రాకుండా చేసేందుకే సిట్ ఈ కట్టుకథ అల్లిందని ఆరోపిస్తూ రాజ్ కసిరెడ్డి విజయవాడ ఎసిబి కోర్టును ఆశ్రయించాడు. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య మైనర్ షేర్ హోల్డర్‌గా ఉన్న ఆస్పత్రి యాజమాన్యంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. సిట్ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని రాజ్ కసిరెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News