Saturday, August 2, 2025

IND vs ENG ఐదో టెస్టుకు వర్షం ముప్పు.. కీలకంగా మారిన టాస్

- Advertisement -
- Advertisement -

ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం ఓవల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన ఐదో చివరి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు రెండు గెలవగా.. భారత్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. ఈక్రమంలో ఐదో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలుపొంది సిరీస్ ను 3-1తో సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఇక, భారత్ కూడా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ 2-2తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ స్టేడియం పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తొలి రోజు ఆటకు వరుణడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. దీంతో పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ లో టాస్ అత్యంత కీలకం కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News