Saturday, August 2, 2025

రూ.1000 కోట్లు ఇప్పిస్తానంటూ మోసం.. పవర్‌స్టార్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓ సంస్థకు రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తానని మోసం చేసిన ప్రముఖ కోలివుడ్ నటుడు ఎస్.శ్రీనివాసన్‌ను (S Srinivasan) పోలీసులు అరెస్ట్ చేశారు. కోలీవుడ్‌లో తనకు తాను పవర్‌స్టార్ అనే ట్యాగ్‌ను పెట్టుకున్నారు శ్రీనివాసన్. అయితే 2018లో ఓ సంస్థకు రూ.1000 కోట్లు అప్పు ఇప్పిస్తానని.. అందుకు తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని అడిగారు. ఆ ఐదు కోట్లను సినిమా తీయడంలో ఉపయోగించారు. రూ.1000 కోట్లు రుణం రాకుంటే రూ.5 కోట్లను నెల రోజుల్లో తిరిగి ఇస్తానని మాటిచ్చారు.

రుణం రాకపోవడంతో సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ పోలీసులు చెన్నైలో శ్రీనివాసన్‌ని అరెస్ట్ చేశారు. శ్రీనివాసన్ (S Srinivasan) 2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2011లో వచ్చిన ‘లథిక’ అనే సినిమాలో హీరోగా నటించి సక్సెస్‌ని అందుకున్నారు. ఆ సినిమా విజయం సాధించడంతో శ్రీనివాసన్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆయన దాదాపు 60 సినిమాల్లో నటించారు. నటుడిగా నటిస్తూనే సినిమాల్లో హాస్య నటుడిగా అలరిస్తున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలతో పాటు చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థని అడ్డుపెట్టుకొనే ఈ మోసానికి పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News