పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని భారత్ ఛాంపియన్స్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో సెమీ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌తో తలపడే పరిస్థితి వచ్చింది. దీంతో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) ఓవరాక్షన్ చేశాడు. ‘ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారో’ అని భారత్‌ను వెక్కిరించాడు. కానీ భారత్ సెమీఫైనల్ మ్యాచ్‌ని రద్దు చేసుకోవడంతో అతని అహంకారానికి తెరపడినట్లైంది.
అఫ్రిదీ (Shahid Afridi) అతి చేష్టలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు అతను భారత్‌పై వ్యంగస్త్రాలు సంధించాడు. ఆ సమయంలో పలువురు భారత మాజీలు అతనికి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అతను భారత్ ఛాంపియన్స్ క్రికెట్ జట్టును ఉధ్దేశించి ‘ఏ ముఖం పెట్టుకొని వస్తారో చూడాలి. భారత్ జట్టుకు మాతో ఆడటం తప్ప మరో దారి లేదు’ అని అన్నాడు. దీనికి టీం ఇండియా మాజీ ఆటగాడు ధవన్ ధీటుగా జవాబిచ్చాడు. ‘‘కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత సైన్యం గురించి మాట్లాడుతున్నారా? మీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించండి’’ అని ధవన్ పేర్కొన్నాడు.