ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీకి ముందు టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీం ఇండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌ని ఏకంగా చివరి మ్యాచ్‌లో పక్కన పెట్టారు. అనంతరం రోహిత్ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత రోహిత్ టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పేశాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వెనుక జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మేనేజ్‌మెంట్ ప్రభావం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి మేనేజర్‌గా ఉన్న జయదేవ్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఆ టెస్ట్‌కు ముందు రోహిత్‌కి (Rohit Sharma) బాబు పుట్టిన కొన్ని రోజులకే గ్రౌండ్‌లోకి వచ్చాడు. కానీ, పరుగులు చేయలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతను జట్టును గెలిపించాడు. దీంతో అతను టెస్టుల కంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు మేనేజ్‌మెంట్ కూడా కొత్త ఛాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతోంది. రెండేళ్ల పాటు కొత్త ప్లేయర్లను రెడీ చేసే పనిలో ఉంది. రోహిత్ కూడా రెండు సంవత్సరాలు ఆడేందుకు సిద్ధంగా లేడని తెలిసింది. పైగా అతనికి గాయాల బెడద ఉంది. ఐపిఎల్‌లోనూ అతను కొన్ని మ్యాచులు ఆడలేదు. దీంతో రోహిత్ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నా’’ అని జయదేవ్ అన్నారు.