Saturday, August 2, 2025

ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) లా, హ్యూమన్ రైట్స్ అండ్, ఆర్‌టిఐ విభాగం-2025 ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్‌లో పాల్గొనబోతున్నారు. ‘రాజ్యాంగ సవాళ్లు- దృక్పథం, మార్గాలు’ అనే థీమ్‌తో ఈ సదస్సు కొనసాగనుంది. భారత రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు ఈ చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సుమారు 1,200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్‌కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మనుసింఘ్వీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News