Saturday, August 2, 2025

ఆత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ దోషి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక లోని మైసూర్ కెఆర్ నగర్ కు చెందిన ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ను శుక్రవారం నాడు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారించింది. శనివారం నాడు శిక్షను ప్రకటించనున్నది. ఈ కేసులో 23 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి కేవలం 14 నెలల్లో కోర్టు విచారణ పూర్తి చేసింది. కోర్టు లో తీవ్ర భావోద్వేగానికి
లోనైన రేవణ్ణ, తీర్పు వెలువడిన తర్వాత కోర్టు గదినుంచి బయటకు వెళ్తూ ..ఏడుస్తూ కన్పించారు. ఈ కేసులో సీఐడి సిట్ దాదాపు 123 ఆధారాలతో కూడిన 2 వేల పేజీల చార్జిషీటును దాఖలు చేసింది. సిఐడి సైబర్ క్రైమ్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ఆ మహిళపై రెండు సార్లు అత్యాచారం చేయడంతో పాటు, ఆ చర్యను వీడియోలో రికార్డు చేశాడని ఆరోపించారు.. కేసు దర్యాప్తు, విచారణ సమయంలో ఆ బాధితురాలు తాను భద్రపరచిన ఓక చీరను భౌతిక సాక్ష్యంగా ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత చీరపై స్పేర్మ్ ఉందని నిర్థార అయింది.

దీనికి కోర్టుకు సమర్పించగా, అత్యాచారాన్ని నిర్థారించడంలో కీలక సాక్ష్యంగా కోర్టు అందీకరించింది. భారత శిక్షాసృ్మతి (ఐపీసీ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నాలజీ (ఐటి) చట్టం 2008 లోని పలు సెక్షన్ల కింద ఈ కేసును నమోదు చేశారు. ఇన్ స్పెక్టర్ శోఖ నేతృత్వంలోని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు సమయంలో 123 ఆధారాలను సేకరించి, 2,000 పేజీల భారీ చార్జ్ షీట్ ను సమర్పించింది.2024 డిసెంబర్ 31న కేసు విచారణ ప్రారంభమైంది. తర్వాత ఏడు నెలల్లో కోర్టు 23 మంది
సాక్షులను క్షణ్ణంగా విచారించింది. వీడియో క్లిప్ లకు సంబంధించి కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలను పరిగణన లోకి తీసుకుంది. ఆలాగే నేరం జరిగిన ప్రదేశం నుంచి, స్పాట్ ఇన్ స్పెక్షన్ నివేదికలను కూడా సమీక్షించింది. ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా నిర్థారించిన కేసులో వివిధ సెక్షన్ల కింద అతడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. జీవిత ఖైదు కూడా పొడిగించబడవచ్చు. శనివారం న్యాయస్థానం అతడి కి శిక్ష విధించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News