Saturday, August 2, 2025

మహిళ దారుణమైన మోసం.. ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని..

- Advertisement -
- Advertisement -

పెళ్లి కాకుండా, డబ్బున్న వాళ్లను టార్గెట్‌గా చేసుకొని.. వాళ్లని వివాహం చేసుకొని ఆ తర్వాత వాళ్లను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసే మహిళను మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్‌పూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సమీరా ఫాతిమా అనే మహిళ ఉపాధ్యాయిని. ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది.

వయస్సు మీదపడుతున్న పెళ్లి కాని ధనవంతులను లక్ష్యంగా చేసుకొని.. వాళ్లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చేరువై.. తనకు విడాకులు అయ్యాయని.. ఓ బిడ్డ కూడా ఉందని దీనమైన కథ చెబుతుంది. వాళ్లకు ఎమోషనల్‌గా చేరువ అవుతుంది. ఆ తర్వాత వాళ్లని పెళ్లి చేసుకొని.. కొన్ని రోజులు గడిచాక పథకం ప్రకారం వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే బెదిరించడానికి ఆమె ఓ ప్రత్యేకమైన గ్యాంగ్ కూడా ఉంది. ఇలా గత 15 సంవత్సరాలలో 8 పెళ్లిళ్లు చేసుకుంది సమీరా. (Maharashtra)

అయితే సమీర తన నుంచి రూ.50 లక్షలు బలవంతంగా వసూలు చేసిందని ఆమెను పెళ్లాడిన వాళ్లలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె బాధితుల్లో రిజర్వ్‌బ్యాంక్‌లో పని చేసే సీనియర్ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. అయితే తొమ్మిదో పెళ్లి చేసుకుందాం అని ప్రయత్నాలు చేస్తున్న ఆమెను ఆ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన సమయంలో ఓ టీ షాపు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News