- Advertisement -
ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఎంఎల్‌సి ఎన్నికల సమయంలో కెటిఆర్, జగదీష్ రెడ్డ్డిపై ఫిర్యాదు చేయగా, మేడిపల్లి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టి వేయాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, జగదీష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కెటిఆర్, జగదీష్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది. పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు ఎలాంటి ఆధారాలు లేవని కెటిఆర్, జగదీశ్వర రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఫేక్ వీడియోలపై ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
- Advertisement -