Saturday, August 2, 2025

జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’

- Advertisement -
- Advertisement -

2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల జ్యూరీ కమిటీ శుక్రవారం కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదికను అందజేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను జ్యూరీ ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకోవడం విశేషం. షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే – హిందీ) అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ దర్శకుడి అవార్డు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తో సేన్‌ను వరించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో

నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరీ’కి అవార్డు దక్కడం విశేషం. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో హన్–మాన్ చిత్రం అవార్డు అందుకోగా.. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం) అవార్డు దక్కించుకున్నాడు. ఇక హన్–మాన్ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్స్‌గా నందు, పృథ్వీ పని చేశారు. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు సాంగ్‌కు జాతీయ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును సాయి రాజేశ్ , నీలమ్ (బేబీ — తెలుగు), రామ్ కుమార్, బాలకృష్ణన్ (పార్కింగ్ – — తమిళం) అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడు పీవీయన్‌యస్ రోహిత్ (బేబీ), ఉత్తమ బాలనటుడు/నటి అవార్డును సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె – గాంధీ తాత చెట్టు – తెలుగు), కబీర్ కందరే (జిప్సీ — మరాఠీ), త్రిష, శ్రీనివాస్, భార్గవ్ (నాల్ 2- — మరాఠీ) అందుకోవడం విశేషం.

జాతీయ అవార్డుల వివరాలు :
ఉత్తమ జాతీయ చిత్రం : 12th ఫెయిల్ (హిందీ)
ఉత్తమ నటుడు : షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి : రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ దర్శకుడు : సుదీప్తో సేన్ (ద కేరళ స్టోరీ – హిందీ)
ఉత్తమ సహాయనటుడు : విజయ రాఘవన్ (పూక్కాలమ్ – మళయాళం), సోమూ భాస్కర్ (పార్కింగ్ – తమిళం)
ఉత్తమ సహాయ నటి : ఊర్వశి (ఉల్లోళుక్కు – మళయాళం), జానకీ బోడీవాలా (వశ్ – గుజరాతీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : ఆశిష్ బెండే (ఆత్మపాంప్లెట్ – మరాఠీ)
ఉత్తమ విశేషాదరణ పొందిన వినోదభరిత చిత్రం : రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : శ్యామ్ బహదూర్ (హిందీ)
ఉత్తమ బాలల చిత్రం : నాల్ 2 (మరాఠీ)
ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ అండ్ కామిక్ మూవీ : హను–మాన్ (తెలుగు)
ఉత్తమ బాలనటుడు /నటి : సుకృతి వేణి (గాంధీతాత చెట్టు – తెలుగు), కబీర్ కందరే (జిప్సీ – మరాఠీ), త్రిష, శ్రీనివాస్, భార్గవ్ (నాల్ 2- మరాఠీ)
ఉత్తమ గాయకుడు : పీవీయన్‌యస్ రోహిత్ (ప్రేమిస్తా… బేబీ- – తెలుగు)
ఉత్తమ గాయని : శిల్పా రావ్ (చెలియా… జవాన్ -హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : ప్రశాంతు మోహపాత్ర (ద కేరళ స్టోరీ – హిందీ)
ఉత్తమ స్క్రీన్ ప్లే : సాయి రాజేశ్ , నీలమ్ (బేబీ – తెలుగు), రామ్ కుమార్, బాలకృష్ణన్ (పార్కింగ్ – తమిళం)
ఉత్తమ డైలాగ్ రైటర్ : దీపక్ కింగ్రాణీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై — హిందీ)
ఉత్తమ ఎడిటింగ్ : మిథున్ మురళి (పూక్కాలమ్ — మళయాళం)
ఉత్తమ సౌండ్ డిజైన్ : సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్ (యానిమల్ — హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : మోహన్ దాస్ (2018- ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో — మళయాళం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ లోవలేకర్, దివ్యా గంభీర్, నిధి గంబీర్ (శ్యామ్ బహదూర్ — హిందీ)
ఉత్తమ మేకప్ : శ్రీకాంత్ దేశాయ్ (శ్యామ్ బహదూర్ — హిందీ)
ఉత్తమ సంగీత దర్శకత్వం : జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి — తమిళం)
ఉత్తమ నేపథ్య సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్ (యానిమల్ — హిందీ)
ఉత్తమ గీత రచయిత : కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు… బలగం — తెలుగు)
ఉత్తమ కొరియోగ్రఫి : వైభవీ మర్చంట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీలోని ధింధోరా బాజే…’ పాటకు)
ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫి) : నందు , పృథ్వీ (హను-మాన్ — తెలుగు)

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు…
ఉత్తమ తెలుగు సినిమా — భగవంత్ కేసరి
ఉత్తమ తమిళ సినిమా — పార్కింగ్
ఉత్తమ పంజాబ్ సినిమా — గాడ్డే గాడ్డే చా
ఉత్తమ ఒరియా సినిమా — పుష్కర
ఉత్తమ మరాఠీ సినిమా — శ్యామ్చీ ఆయీ
ఉత్తమ మళయాళం సినిమా – – ఉల్లోళుక్కు
ఉత్తమ కన్నడ – సినిమా – కందీలు – ద రే ఆఫ్ హోప్
ఉత్తమ హిందీ సినిమా — కఠల్ – ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
ఉత్తమ గుజరాతీ సినిమా — వశ్
ఉత్తమ బెంగాలీ సినిమా — డీప్ ఫ్రిజ్
ఉత్తమ అస్సామీ సినిమా — రొంగటపు 1982

అవార్డులు పొందిన చిత్రాల జాబితా..

బెస్ట్ స్క్రిప్ట్ చిత్రం: సన్‌ఫ్లవర్స్ (కన్నడ)కు జ్యూరీ అవార్డు

బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ద ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)

బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)

ABN ఛానల్ ఫాలో అవ్వండి

బెస్ట్ నాన్ ఫీచర్ సినిమా: క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం)

బెస్ట్ నాన్ ఫీచర్ సినిమా: నెకల్ (మలయాళం)

బెస్ట్ నాన్ ఫీచర్ సినిమా: ద సీ అండ్ సెవెన్ విలేజస్ (ఒడియా)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రణీల్ దేశాయ్

బెస్ట్ షార్ట్ ఫిల్మ్: గిధ్ ది స్కావెంజర్ (హిందీ)

ఉత్తమ కథా రచయిత: చిదానంద నాయక్ (కన్నడ)

ఉత్తమ దర్శకుడు: పీయూష్ ఠాకూర్ (ఫస్ట్ ఫిల్మ్)

ఉత్తమ సంగత దర్శకుడు: ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిల్మ్)

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి

జాతీయ ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్

క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం) కు అవార్డు

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – హనుమాన్ (తెలుగు)

బెస్ట్ లిరిక్స్ – బలగం (కాసర్ల శ్యామ్)

ఊరూ.. పల్లెటూరు పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డు

ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబీ

జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: కథల్

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాష్ (వాతి)

ఉత్తమ కథా రచయిత: చిదానంద నాయక్

ఉత్తమ దర్శకుడు: పీయూష్ ఠాకూర్ (ఫస్ట్ ఫిల్మ్)

ఉత్తమ ఎడిటర్: మిథున్ మురళి (పూక్కాలమ్)

ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ)

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – హనుమాన్ (తెలుగు)

బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెకట్స్ – హనుమాన్ (తెలుగు)

బెస్ట్ లిరిక్స్ – బలగం (కాసర్ల శ్యామ్)

ఊరూ.. పల్లెటూరు పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డు

ఉత్తమ స్క్రీన్ ప్లే – బేబీ

ఉత్తమ నేపథ్య గాయకుడు – రోహిత్(బేబీ)

ఉత్తమ బాల నటి – సుకృతి వేణి(గాంధీతాత చెట్టు)

దర్శకుడు సుకుమార్ కూమార్తె సుకృతి వేణి

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఇద్దరికి ఉత్తమ నటుడు అవార్డులు.. జాతీయ ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్) తోపాటు జాతీయ ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)

జాతీయ ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News