Saturday, August 2, 2025

విజయసాయి రెడ్డి కుమార్తెకు రూ.17 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి ఎపి హైకోర్టు షాక్ ఇచ్చింది. నేహా రెడ్డికి రూ.17 కోట్ల జరిమానా విధించింది. నేహా రెడ్డి విశాఖ బీచ్ సమీపంలో సీఆర్జెడ్ నియమాలను అతిక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు హైకోర్టు తేల్చింది. సముద్రతీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిర్మాణాలు పర్యావరణానికి హానికరంగా ఉన్నట్టు అధికార నివేదికల ద్వారా స్పష్టమైం ది. దీంతో హైకోర్టు ఆమెపై రూ.17 కోట్ల జరిమానా విధించింది. ఈ నిర్మాణాలపై పిటిషన్ దాఖలవ్వడంతో హైకోర్టు విచారణ చేపట్టి, పర్యావరణ శాఖ నివేదికల ఆధారంగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేల్చింది. దీంతో నేహా రెడ్డిపై రోజుకు రూ.1.2 లక్షల చొప్పున అంటే 1455 రోజులకు గాను మొత్తం రూ.17 కోట్ల జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News