Saturday, August 2, 2025

అణుబాంబులాంటి ఆధారాలున్నాయి

- Advertisement -
- Advertisement -

బిజెపి కోసం ఇసి ఓట్ల చోరీ
రుజువు చేయడానికి
ఆటంబాంబు లాంటి
ఆధారాలు మాదగ్గర
ఉన్నాయి అవి పేల్చామో
ఇసి దాక్కోవడానికి కూడా
చోటు దొరకదు ఇసి తీరు
దేశద్రోహం కంటే
తీవ్రమైనది దేశ
ప్రయోజనాలకు
వ్యతిరేకంగా పని చేస్తున్న
ఏ ఒక్క అధికారినీ
వదిలిపెట్టం కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ సంచలన
వ్యాఖ్యలు రాహుల్ మాటలను
పట్టించుకోం :ఇసి

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన , దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదని తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవర ణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం వి డుదల చేసింది. అయితే ఈ ప్రక్రియను ముందునుంచీ వ్య తిరేకిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ రాష్ట్ర స్థాయి  నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతోపాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి.

ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈసీ గురించి బయటపడింది. ఆర్నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ” అని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. బీజేపీ కోసమే ఈసీ ఈ ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ మండిపడ్డారు. “ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం” అని విపక్ష నేత హెచ్చరించారు.

ఆ మాటలు పట్టించుకోవద్దు : ఈసీ
ఓట్ల చౌర్యంపై రాహుల్‌తోపాటు విపక్షాలు చేస్తోన్న ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలేనని తేల్చి చెప్పింది. ఇలా రోజూ వచ్చే బెదిరింపులను తాము పట్టించుకోబోమని తెలిపింది. రాహుల్ లాంటి వారు చేస్తోన్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదని తమ అధికారులకు చెప్పామని ఈసీ స్పష్టం చేసింది. పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణలను విస్మరించాలని అధికారులకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News