Saturday, August 2, 2025

ముఖ గుర్తింపుతో టీచర్ల హాజరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)) హాజరు విధానం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. పా ఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిం చే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి తొలి రోజు ఎఫ్‌ఆర్‌ఎస్ వి ధానంలో హాజరు నమోదు చేసుకున్నారు. విద్యాశాఖ పరిధిలో ప్ర భుత్వ పాఠశాలలు మొత్తం 24,973 ఉండగా అందులో బోధన, బో ధనేతర సిబ్బంది కలిపి మొత్తం 1,28,760 మంది ఉన్నారు. కాగా శుక్రవారం ముఖ గుర్తింపు హాజరు యాప్(ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా 96,327 (75 శాతం) మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 89,922 (93.3 శాతం) మంది తమ హాజరును ముఖ గుర్తింపు హాజరు యాప్ ద్వారా నమోదు చేసుకున్నారు. కొన్ని జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అమలు చేశారు. ఆయా చోట్ల సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించారు.

ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా హాజరు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. అందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డిఎస్‌ఇ ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్‌ఎంలు, టీచర్ల, నాన్ టీచింగ్ ఉద్యోగుల ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నారు. హెచ్‌ఎంలు తమ సెల్‌ఫోన్‌లోని డిఎస్‌ఇ యాప్‌లో టీచర్ మాడ్యూల్ టీచర్లకు, నాన్‌టీచింగ్ మాడ్యూల్‌లో నాన్‌టీచింగ్ సిబ్బందికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం తదితర వివరాలు అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది తమతమ సెల్‌ఫోన్లలో సంబంధిత యాప్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ తీసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News