జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, చందయ్యపల్లి గ్రామ కార్యదర్శి టి రాజన్నపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రాజన్నను సస్పెండ్ చేస్తూ శు క్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ కార్యదర్శి సస్పెన్షన్‌కు గల కారణాలు ఇలా ఉన్నా యి. గ్రామాల్లో శానిటేషన్ పనులు పర్యవేక్షించడాని కి కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం 7 గంటలలో పు ఆయా గ్రామాల్లో మానిటరింగ్ చేయాల్సి ఉం టుంది. అంతేకాకుండా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన డిఎస్‌ఆర్ అప్లికేషన్‌లో
రికగ్నైజేషన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చే యాల్సి ఉంటుంది. అయితే రాజన్న మాత్రం పారిశుద్ధ పనులు పర్యవేక్షించకుండానే అంతకుముం దే తీసిన క్యాప్చర్ ఫొటోల ద్వారా జూన్‌లో హాజరు నమోదుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన ఫొ టో బదులు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొ టోను అప్‌లోడ్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు రాజన్నకు మొదట షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిఎస్‌ఆర్ అప్లికేషన్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాత విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించిన రాజన్నను కలెక్టర్ సస్పెండ్ చేశారు.